అది నేను వైజ్ఞానిక బ్రహ్మచారి (B.Tech) గా చేరటానికి చూసిన ఎదురు చూపులు ముగిసిన రోజు. ఎంసెట్ లో ఓమాదిరిగా ర్యాంకు తెచ్చుకొని, కౌన్సెలింగ్ అయ్యింది అనిపించి ఇంక కాలేజీ లో చేరటానికి అప్పటికి చాలా రోజులు ఎదురుచూసాము. మా బ్యాచ్ కి వచ్చినంత gap ఎవ్వరికి రాలేదనుకుంట August లో కౌన్సెలింగ్ అయిపోతే December 20 కి జాయిన్ అయ్యాము. అప్పటి వరకు రోజు TTT (తినటం తిరగటం తొంగోటం). సాయంత్రం మాత్రం క్రికెట్ ఆడేవాళ్ళం మా కజిన్ బ్యాచ్ అంతా. క్రికెట్ తరవాత 1.5 lt thumsup, ఆలూ చిప్స్ బ్యాండ్ పడేది job చేసే వాళ్ళకి.
చివరకు అనుకున్న రోజు వచ్చింది. మొదటిసారి కరీంనగర్ ప్రయాణం. నన్ను కాలేజీ లో దింపటానికి మా అన్నయ్య వచ్చాడు. ఆ రోజు బస్ లోమాతోపాటు ఇంకొక నలుగురు మాత్రమే వున్నారు (డ్రైవర్, కండక్టర్ కలుపుకొని). అప్పుడు అనిపించింది సీజన్కానప్పుడు RTC వాళ్ళు బస్సులను నష్టం లేకుండా సరిగ్గా నడిపేలా వాళ్ళకి మంచి అవిడియా ఇవ్వాలి అని, కానీ మళ్ళిదాని గురించి ఆలోచించలేదు. మా కాలేజీ కరీంనగర్ కి సుమారు 8 కిమీ ముందు వుంటుంది. ఇక్కడ మనం ఒకవిషయం చర్చించాలి. కొన్నిసార్లు కొంతమంది (to be on safe side) ఈ 'ముందు', 'వెనక' లకు కొంచం తికమకపడుతుంటారు. ముందు అంటే ఇంకా ముందర అని కాదు ఇక్కడ, కరీంనగర్ కి వెళ్ళే ముందే రోడ్డుపై వస్తుంది. మళ్ళిరోడ్డుపై అంటే మీ కాలేజీ రోడ్డు మీద వుంటుందా అని అడక్కండి ప్లీజ్. మా కాలేజీ రిక్వెస్ట్ స్టాప్ లో బస్ ఆపించుకొని దిగి, ఇద్దరం గేటు వైపు నడుస్తున్నాము. ఇంతలో ఇద్దరు సీనియర్లు మాకు ఎదురుగ వస్తూ, నన్ను ఆపి నా జేబు లో పెన్నుతీసుకొని "బాబూ, ఎప్పుడు జేబు లో పెన్ను పెట్టుకోకు" అని చెప్పి అది వాళ్ళ జేబులో పెట్టుకొని వెళ్ళిపోయారు. నాతోపాటు వస్తున్నమా అన్నయ్య ముందు ఎక్కడో వున్నాడు. ఇంత ragging జరుగుతుంటే నాకు హ్యాండ్ ఇచ్చివెళ్లిపోతావా అనుకున్నాను, కానీ నాకు ఆ తరవాతే తెలిసింది ఆ ragging కేవలం సముద్రం లో నీటిబొట్టు అంత అని.
ఖమ్మం నుంచి మా మామయ్య, మా బామ్మర్ది (నాకన్నా నాలుగే రోజులు చిన్న, కానీ నాకే advantage) శీను అప్పటికేవచ్చివున్నారు. ప్రిన్సిపాల్ గారు ఒక గంట స్వాగత ప్రవచనం చేసాక మిగతా ఫార్మాలిటీస్ చూసుకొని హాస్టల్ బిల్డింగ్ కివెళ్ళాము. ఫస్ట్ ఇయర్ హాస్టల్ వేరు, సీనియర్ల హాస్టల్ వేరు. మా హాస్టల్ బిల్డింగ్ రెండు అంతస్తులు వుంది. ఏ రూంఖాళీగా వుంటే అందులో చేరిపొండి అని చెప్పారు. మేము రెండవ అంతస్తు లో చివరి రూం కి వెళ్లి చెరొక మంచంపైసామాన్లు పెట్టాము. అప్పటికే మూడవ మంచం పై ఎవరివో సామాన్లు వున్నాయి. అవి చూసి నేను మా అన్నయ్యతో "అవును అవి అబ్బాయివా, అమ్మయివా" అని అడిగాను. అప్పుడు మా అన్నయ్య, మమ్మయ్య, శీను అందరు నవ్విబాబూ అబ్బాయిలని అమ్మాయిలని ఒకే హాస్టల్ లో ఉంచితే, మీ కాలేజీ వాళ్ళు ఒక స్కూల్ కూడా కట్టాలి మీ పిల్లలకి" అన్నారు. CNB.
ఈ టపా చీ నా బతుకు ఇన్స్పిరేషన్ తో రాసాను. నేను ఇంజనీరింగ్ లో చేరి ఇప్పటికి ప్ఫది సమత్సరాలు అయ్యిందిఅంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నానని కాదు). కొన్ని జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. వీలుచిక్కినప్పుడు/గుర్తుకొచ్చినప్పుడు అవి ఇక్కడే రాస్తుంటాను. మళ్ళి రండి.
Subscribe to:
Post Comments (Atom)
బానే వుంది కానీ కొంచం ఉప్పు తక్కువ అయింది అందుమూలంగా కొంచం హాస్యం అనే ఉప్పు వేసి సస్పెన్సు అనే కారాన్ని చేర్చి మంచి తాలింపు పెట్టగలరని తెలియజేయదమైనది చిత్తగించగలరు అప్పుడు గుళ్ళో పులిహోర లా వుంటుంది మీ ఈ blog
ReplyDelete