GATE లో మంచి rank వచ్చిందని సంతోషపడే లోపే IIT ల application deadlines కూడా వచ్చేశాయి. దాదాపుఅన్నిటికి అప్లై చేశాను. IISc లో rank base మీద వచ్చే అవకాశం లేదు కాబట్టి CEDT అని test and interview తోసెలెక్ట్ చేసే కోర్సు కి అప్లై చేశాను. మొత్తానికి ఆ పరిక్ష కోసం మొదటిసారి బెంగుళూరు వెళ్ళాను. IISc కాంపస్ లోకిఅడుగు పెడుతూనే ఎందుకో కొంచం భయం, కొంచం ఉద్వేగం చోటుచేసుకున్నాయి. పరీక్షలో engineering subjects, mathematics, physics అన్ని కలగలిపి చాలా భయంకరం గా ఇచ్చారు పేపర్. వచ్చినంత రాసి బయట పడ్డాను, మొత్తానికి interview కి సెలెక్ట్ అయ్యాను. అక్కడే వుండి అసలు కథ.
మరుసటి రోజు Interview కి వెల్దును కదా, అక్కడ 4-5 పానెల్స్ వున్నాయి. ఒక్కొక్క పానెల్ లో ఆరుగురు ఇంటర్వ్యూచేస్తున్నారు. నాకు పడ్డ పానెల్ లో అయితే ఒక ఫారెనర్ కూడా వున్నాడు. ఒక ప్రొఫెసర్ పేరు జమదగ్ని అట. సరే పులిబోను లోకి వెళ్ళాక ఇంక భయపడితే లాభం ఏముంది అని good morning చెప్పి కూర్చున్నాను. ఆ రోజు దురదృష్టం నాజేబులో పెట్టుకొని తిరుగుతున్నాను. వాళ్ళు మొదటనే నా ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు. మనం కొద్దిగా flashback లోకివెళ్ళితే, final year porject కాలేజీ లో బుద్ధిగా చేసుకొండిరా నాయనా అంటే వినకుండా పట్టు పట్టి industrial project చేస్తాము అని చెప్పి ఒక కంపెనీ (పేరు అప్రస్తుతం) లో project కి అని చేరాము. project కేవలం నెల రోజులే. ఇక మేము ఏమి చేసామో (చెయ్యలేదో) మీరు అర్ధం చేసుకోవచ్చు. మా ప్రాజెక్ట్ గురించి నాటుగా చెప్పాలంటే 'బొగ్గు శుద్ధియంత్రము'. ఒక బెల్టు పై వచ్చే బొగ్గు మిశ్రమం లో నీళ్లు కలపటం computer ద్వార control చెయ్యటం అన్నమాట.
'Can you explain briefly about your project' అని అడిగితే ఏదో నాకు వచ్చిన రెండు ముక్కలు కక్కేశాను. వాళ్ళకు నా పరిస్థితి అర్ధం అయ్యింది. ఇక ఆడుకోవటం మొదలు పెట్టారు. Title లో మేము 'density' బదులు 'gravity' అన్న పదం వాడాము. వాళ్ళు దానికి 'we thought you did something to control gravity, is it not true' అని నవ్వుతు అడిగారు. 'gravity means actually specific gravity, హి హి' అన్నాను.
prof: 'how do you collect data from the transducer'
me: 'using a data acquisition card sir'
prof: 'what is the data rate'
me: '...' '100 kbps sir' (ఆ నెంబర్ ఏదో బాగుంది అని చెప్పాను)
prof: 'I can run internet with that rate'
కొద్దిసేపు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు.
తరవాత ప్రశ్న: 'if you are measuring the density of a moving material, then did you consider doppler effect?' 'gravity'
నేను: ...
అలా కొద్దిసేపు ఆడుకున్నాక ఒక ప్రొఫెసర్ watch చూసి, 'oh I think half-an-hour is over, we are running late, thank you for your time' అని అన్నారు. బయటకు వచ్చేశాను.
ఇక నేను ఇంటర్వ్యూ result చూసుకోలేదు.
అదండీ నా మొదటి ఇంటర్వ్యూ ప్రహసనం. కాబట్టి బాబులూ, B.Tech ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చెయ్యకండి.
Thursday, December 10, 2009
కాలేజీ లో మొదటి రోజు
అది నేను వైజ్ఞానిక బ్రహ్మచారి (B.Tech) గా చేరటానికి చూసిన ఎదురు చూపులు ముగిసిన రోజు. ఎంసెట్ లో ఓమాదిరిగా ర్యాంకు తెచ్చుకొని, కౌన్సెలింగ్ అయ్యింది అనిపించి ఇంక కాలేజీ లో చేరటానికి అప్పటికి చాలా రోజులు ఎదురుచూసాము. మా బ్యాచ్ కి వచ్చినంత gap ఎవ్వరికి రాలేదనుకుంట August లో కౌన్సెలింగ్ అయిపోతే December 20 కి జాయిన్ అయ్యాము. అప్పటి వరకు రోజు TTT (తినటం తిరగటం తొంగోటం). సాయంత్రం మాత్రం క్రికెట్ ఆడేవాళ్ళం మా కజిన్ బ్యాచ్ అంతా. క్రికెట్ తరవాత 1.5 lt thumsup, ఆలూ చిప్స్ బ్యాండ్ పడేది job చేసే వాళ్ళకి.
చివరకు అనుకున్న రోజు వచ్చింది. మొదటిసారి కరీంనగర్ ప్రయాణం. నన్ను కాలేజీ లో దింపటానికి మా అన్నయ్య వచ్చాడు. ఆ రోజు బస్ లోమాతోపాటు ఇంకొక నలుగురు మాత్రమే వున్నారు (డ్రైవర్, కండక్టర్ కలుపుకొని). అప్పుడు అనిపించింది సీజన్కానప్పుడు RTC వాళ్ళు బస్సులను నష్టం లేకుండా సరిగ్గా నడిపేలా వాళ్ళకి మంచి అవిడియా ఇవ్వాలి అని, కానీ మళ్ళిదాని గురించి ఆలోచించలేదు. మా కాలేజీ కరీంనగర్ కి సుమారు 8 కిమీ ముందు వుంటుంది. ఇక్కడ మనం ఒకవిషయం చర్చించాలి. కొన్నిసార్లు కొంతమంది (to be on safe side) ఈ 'ముందు', 'వెనక' లకు కొంచం తికమకపడుతుంటారు. ముందు అంటే ఇంకా ముందర అని కాదు ఇక్కడ, కరీంనగర్ కి వెళ్ళే ముందే రోడ్డుపై వస్తుంది. మళ్ళిరోడ్డుపై అంటే మీ కాలేజీ రోడ్డు మీద వుంటుందా అని అడక్కండి ప్లీజ్. మా కాలేజీ రిక్వెస్ట్ స్టాప్ లో బస్ ఆపించుకొని దిగి, ఇద్దరం గేటు వైపు నడుస్తున్నాము. ఇంతలో ఇద్దరు సీనియర్లు మాకు ఎదురుగ వస్తూ, నన్ను ఆపి నా జేబు లో పెన్నుతీసుకొని "బాబూ, ఎప్పుడు జేబు లో పెన్ను పెట్టుకోకు" అని చెప్పి అది వాళ్ళ జేబులో పెట్టుకొని వెళ్ళిపోయారు. నాతోపాటు వస్తున్నమా అన్నయ్య ముందు ఎక్కడో వున్నాడు. ఇంత ragging జరుగుతుంటే నాకు హ్యాండ్ ఇచ్చివెళ్లిపోతావా అనుకున్నాను, కానీ నాకు ఆ తరవాతే తెలిసింది ఆ ragging కేవలం సముద్రం లో నీటిబొట్టు అంత అని.
ఖమ్మం నుంచి మా మామయ్య, మా బామ్మర్ది (నాకన్నా నాలుగే రోజులు చిన్న, కానీ నాకే advantage) శీను అప్పటికేవచ్చివున్నారు. ప్రిన్సిపాల్ గారు ఒక గంట స్వాగత ప్రవచనం చేసాక మిగతా ఫార్మాలిటీస్ చూసుకొని హాస్టల్ బిల్డింగ్ కివెళ్ళాము. ఫస్ట్ ఇయర్ హాస్టల్ వేరు, సీనియర్ల హాస్టల్ వేరు. మా హాస్టల్ బిల్డింగ్ రెండు అంతస్తులు వుంది. ఏ రూంఖాళీగా వుంటే అందులో చేరిపొండి అని చెప్పారు. మేము రెండవ అంతస్తు లో చివరి రూం కి వెళ్లి చెరొక మంచంపైసామాన్లు పెట్టాము. అప్పటికే మూడవ మంచం పై ఎవరివో సామాన్లు వున్నాయి. అవి చూసి నేను మా అన్నయ్యతో "అవును అవి అబ్బాయివా, అమ్మయివా" అని అడిగాను. అప్పుడు మా అన్నయ్య, మమ్మయ్య, శీను అందరు నవ్విబాబూ అబ్బాయిలని అమ్మాయిలని ఒకే హాస్టల్ లో ఉంచితే, మీ కాలేజీ వాళ్ళు ఒక స్కూల్ కూడా కట్టాలి మీ పిల్లలకి" అన్నారు. CNB.
ఈ టపా చీ నా బతుకు ఇన్స్పిరేషన్ తో రాసాను. నేను ఇంజనీరింగ్ లో చేరి ఇప్పటికి ప్ఫది సమత్సరాలు అయ్యిందిఅంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నానని కాదు). కొన్ని జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోలేదు. వీలుచిక్కినప్పుడు/గుర్తుకొచ్చినప్పుడు అవి ఇక్కడే రాస్తుంటాను. మళ్ళి రండి.

Subscribe to:
Posts (Atom)