Thursday, September 5, 2019

Teachers day

ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయుల్ని స్మరించుకునే ప్రయత్నం.. 

3వ తరగతి లో ఇందిర టీచర్ - క్లాస్ ఫోటో సమయంలో నేను లేను అని తరువాత నన్ను స్టూడియో కి తీసుకెళ్లి ప్రత్యేకం గా ఫోటో దిగారు. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది

శుభోదయ స్కూల్ లో బహుశా 7 వ తరగతి నుంచి maths సబ్జెక్టు ఆంజనేయులు సర్ చెప్పేవారు 
చాలా మంచి టీచర్ మాలో ఆత్మ విశ్వాసం పెంచటానికి బోర్డు పై లెక్కలు చేయించేవారు
నేను ఒక్కోసారి హోంవర్క్ చేయక పొతే ఆ రోజు ఎవరినీ కొట్టేవారు కాదు
10 వ తరగతి లో ట్యూషన్ కి వెళ్లానని ఆయనకు కోపం రావటం, నన్ను పిలిచి అడగటం నాకు ఇంకా గుర్తు వుంది 

science  సబ్జెక్టు చెప్పిన సూర్యకళ టీచర్ కూడా ఎప్పటికీ గుర్తు ఉండిపోతారు 
ఒకరోజు సమతుల ఆహారం అంటే ఏమిటి అనే ప్రశ్న కు మా తరగతి లో ఒక అబ్బాయి జవాబు చెప్పలేదు, అప్పుడు తన కంటే చిన్న తరగతి పిల్లలకు కూడా జవాబు తెలుసు అని చెప్పి, శ్రావణి ని పిలిపించి జవాబు చెప్పించారు తరవాత ఆ అబ్బాయికి తనతో చెంప దెబ్బలు వేయించారు

ఇంటర్మీడియట్ లో IIT maths చెప్పిన సంతానం సర్ - ఆయన్ని impress చేయటానికి కోటి లో కొన్న maths theory బుక్స్ ఆయనకి కనపడేలా బెంచ్ మీద పెట్టే వాణ్ని 

ఇంజనీరింగ్ లో రవికిరణ్ సర్, మదన్ సర్, శ్రీనివాసులు సర్ అందరిలో బెస్ట్ లెక్చరర్స్. 

ఎంటెక్ లో professors అందరూ ఉద్దండ పండితులే. ఎవరికి వారే సాటి అని చెప్పాలి... 

భగవంతుడు మా టీచర్స్ అందరిని చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నాను. మా టీచర్స్ ఏ కాదు.. లోకం లోని అందరు టీచర్స్ ని చల్లగా కాపాడు స్వామీ.